ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, పెంబి, సిరికొండ, జన్నారం మండలాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.