కోట శ్రీనివాసరావు మృతిపై సంతాపం తెలిపిన ఎంపీ

కృష్ణా: విజయవాడ మాజీ ఎమ్మెల్యే నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై ఎంపీ కేశినేని శివనాథ్ సంతాపం తెలిపారు. కోట శ్రీనివాసరావు ఇక లేరనే మాట చాలా బాధ కలిగించిందని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.