రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

NRPT: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం మద్వార్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తామన్నారు.