యూరియా కోసం రైతులు పడిగాపులు

యూరియా కోసం రైతులు పడిగాపులు

NGKL: జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. అచ్చంపేటలోని సహకార సంఘం కార్యాలయం వద్ద గురువారం రైతులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. గంటల తరబడి క్యూలో నిలబడి యూరియా కోసం ఎదురుచూశారు. చెప్పులను లైనులో పెట్టి తమ వంతు కోసం వేచి చూస్తున్న దృశ్యం రైతుల ఇబ్బందులకు అద్దం పడుతోంది. ఎరువుల కోసం ఎదురుచూస్తూ పనులు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిదిన్నారు.