నేడు ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం

కృష్ణా: ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ప్రారంభించనున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, ఎస్పీ గంగాధర్ రావు, డీఐజీ అశోక్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇటీవల అత్యాధునిక హంగులతో భారీ విశాల ప్రాంగణంలో పోలీస్ స్టేషన్ నిర్మించారు. నేడు ఆ స్టేషన్‌ను ప్రారంభించనున్నట్లు ఎస్పీ తెలిపారు.