నేడు రన్ ఫర్ యూనిటీలో పాల్గొననున్న ఎంపీ

నేడు రన్ ఫర్ యూనిటీలో పాల్గొననున్న ఎంపీ

MBNR: జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించబోయే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పాల్గొననున్నారు. ర్యాలీ ఉదయం 9 గంటలకు స్టేడియం మైదానం నుండి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా అశోక్ టాకీస్ క్లాక్ టవర్ ఓల్డ్ బస్టాండు తెలంగాణ చౌరస్తా మీదుగా బాలుర కళాశాల మైదానం వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు హాజరుకానున్నారు.