80 ఏళ్ల వృద్ధుడి కన్నుదానం
KDP: కొండాపురం పట్టణానికి చెందిన 80 ఏళ్ల వి. చలపతి అనారోగ్యంతో గురువారం తుది శ్వాస విడిచారు. ఆయన భార్య, కుమారుడు బాలాజీ మానవత్వంతో ఆయన నేత్రదానానికి సంకల్పించారు. కొండాపురం సామాజిక వేత్త, మాజీ ఆర్మీ ఉద్యోగి హజీవలి సహకారంతో అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ వైద్యులు ఆయన నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అభినందించారు.