శ్రీశైలానికి సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే

NDL: గురువారం ఉదయం 9.45గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టరులో బయలుదేరి 10.30 సున్నిపెంటకు చేరుకుంటారు. అక్కడి నుండి శ్రీశైలం చేరుకుని 10.50ని నుండి 11.10వరకు స్వామి, అమ్మవార్ల దర్శన అనంతరం శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. ఏపీజెన్‌కో కుడిగట్టు జల విద్యుత్తు కేంద్రం సందర్శించి తర్వాత సున్నిపెంటలో ఏర్పాటు చేసే ప్రజా వేదికకు సీఎం హాజరవుతారు.