'దేశ GDPలో 10% వాటాను TGనుంచి అందించాలి'
HYD: గ్లోబల్ సమ్మిట్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 'రైజింగ్ విజన్ రూపకల్పనలో సహకరించిన వారికి ధన్యవాదాలు. అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సమ్మిట్‌లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 2047 నాటికి దేశ GDPలో 10% వాటాను TGనుంచి అందించాలన్నది మా లక్ష్యం' అని పేర్కొన్నారు.