VIDEO: పొదలపల్లిలో అగ్నిప్రమాదం

CTR: చౌడేపల్లె మండలం పొదలపల్లిలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. గ్రామంలోని నరేశ్‌కు చెందిన నీలగిరి తోటలో మంటలు చెలరేగినట్లు పుంగనూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఇళ్లకు విస్తరించకుండా అదుపు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పొగ తాగి పడేయడంతో ప్రమాదం జరిగి ఉంటుందని ఫైర్ అధికారులు తెలిపారు.