రెవెన్యూ అధికారుల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి

SKLM: రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి ఎక్కువ సంఖ్యలో వినతులు వచ్చాయి. వాటి పరిష్కారంలో వీఆర్వో, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బంది పై అసంతృప్తి వ్యక్తం చేశారు.