VIDEO: ఆత్మకూరు లాడ్జిల్లో తనిఖీలు
NLR: దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో ఆత్మకూరు పట్టణంలో సోమవారం రాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని అన్ని లాడ్జిల్లో సోదాలు చేపట్టారు. లాడ్జిలో ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డులు తప్పనిసరిగా చెక్ చేయాలని లాడ్జి నిర్వాహకులకు సూచించారు.