విద్యార్థులకు చట్టాలపై అవగాహన

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

VZM: ఎస్.కోట పట్టణంలో ఉన్న జెడ్పీ పాఠశాలలో పట్టణ సీఐ నారాయణమూర్తి, మండల విద్యాశాఖ అధికారి నరసింగరావు పోక్సో చట్టంపై శనివారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన కారాగార శిక్షలు, జరిమానా విధిస్తారని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు స్వీయ రక్షణ శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు.