అమరావతిలో కూటమి కీలక సమావేశం నేడు
GNTR: అమరావతిలో నేడు కూటమి నేతల ముఖ్య సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొంటారు. మహిళా బిల్లు ఆమోదం తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలు, కూటమి సమన్వయం ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.