నేడు కొలిమిగుండ్లకు మంత్రుల రాక..!

NDL: నేడు కొలిమిగుండ్లకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వస్తున్నట్లు మండల TDP అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి తెలిపారు. కొలిమిగుండ్ల కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం మహోత్సవం కార్యక్రమంలో మంత్రులు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అనంతరం మంత్రులు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.