రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
NLR: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వేదాయపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. నెల్లూరు, వేదాయపాలెంలోని జనశక్తి నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు (63) జీవితంపై విరక్తి చెంది వేదాయపాళెం రైల్వే స్టేషన్‌లోని సౌత్ యార్డ్ వద్దకు వచ్చి రైలు కింద పడ్డాడు. దీంతో మృతదేహం గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జు అయింది. రైల్వే ఎస్సై హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.