కుప్పంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఛైర్మన్ తనిఖీలు

కుప్పంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఛైర్మన్ తనిఖీలు

CTR: కుప్పం నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట జడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలని టీచర్లకు సూచించారు. పాఠశాలకు మెయిన్ గేట్, టాయిలెట్ డోర్స్ మంజూరు చేయాలని సిబ్బంది, విద్యార్థులు కోరగా తక్షణమే సమస్య పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు.