రాయితీలో మొక్కజొన్న విత్తనాలు: ఏవో
MDK: నిజాంపేట మండల రైతులకు రాయితీపై మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి తెలిపారు. ఎన్ఎఫ్ఎస్ఎం పథకం కింద 7 క్వింటాళ్ల హైబ్రిడ్ విత్తనాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. 4 కిలోల పాకెట్ ధర రూ.1380 కాగా, రూ.400 రాయితీ వస్తుందన్నారు. విత్తనాల కోసం రైతులు పట్టా, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలను అందించాలని ఆయన సూచించారు.