అంబులెన్సులను తనిఖీ చేసిన ప్రోగ్రాం మేనేజర్
ADB: ఉట్నూర్‌లోని 108,102 అంబులెన్సులను ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, కోఆర్డినేటర్ శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్సులోని వైద్య పరికరాలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, ఎండకాలం దృష్ట్యా వాహనాల్లో ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.