పాఠశాలను సందర్శించిన కలెక్టర్
ఆసిఫాబాద్ మండలం తుంపల్లి MPUPS పాఠశాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మంగళవారం సందర్శించారు. పాఠశాల తరగతి గదులు, కిచెన్ రూమ్, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందజేయాలని సిబ్బందికి సూచించారు.