కోసిగిలో భారీ వర్షానికి కూలిపోయిన ఇల్లు
KRNL: కోసిగిలోని సిద్దప్ప పాలెంలో నివసించే నిరుపేద వృద్ధురాలు మందుల నరసమ్మ ఇల్లు, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇవాళ పూర్తిగా కూలిపోయింది. దీంతో ఆమె నిలువ నీడ కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు పడుతన్నట్లు తెలిపారు. అధికారులు ఆమే పరిస్థితిని పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా తక్షణమే కొత్త ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.