చేనేత కార్మికుల సమస్యలపై మంత్రి దృష్టికి వినతిపత్రాలు
సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో చేనేత కార్మిక సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పలు సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతిపత్రాలను అందజేసిన వారిని మంత్రి సవిత కలసి మాట్లాడారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆమె తెలిపారు.