పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

KRNL: విశ్వా వసు నామ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా దొర్నిపాడు మండలం W.గోవిందిన్నెలో వెలసిన శ్రీ మూల పెద్దమ్మ తల్లిని ఆదివారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ దర్శించుకున్నారు. 11ఏళ్ల తర్వాత మళ్లీ W.గోవిందిన్నెలో పెద్దమ్మా తల్లీ దేవర జూన్ నెలలో జరుగుతుందని. ఆళ్లగడ్డ ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి పెద్దమ్మ తల్లి దేవరలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.