రైలు ప్రమాదంలో వ్యక్తి గాయలు

GDWL: జిల్లాలోని పిల్లిగుండ్ల కాలనీ సమీపంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గద్వాల-రాయచూరు డెమో రైలు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. అతడి రెండు కాళ్లు తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అనేక అనుమానాలు కలిగిస్తోంది. ప్రస్తుతానికి బాధితుడు చికిత్స పొందుతున్నాడు.