చౌడేపల్లిలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ నాయకులు

CTR: చౌడేపల్లి మండలంలోని ఆమినిగుంట పంచాయతీ సింగిరిగుంటకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఆదివారం వైసీపీలో చేరారు. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సమక్షంలో వారికి వైకాపా కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నడింపల్లి దామోదర్ రాజు, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.