VIDEO: సమ్మె ప్రాంగణంలోనే పెళ్లిరోజు వేడుక..లేడీ కండక్టర్‌కు సర్‌ప్రైజ్
MHBD: తొర్రూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ముందు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులు మానవీయతను చాటుకున్నారు. సమ్మెలో పాల్గొంటున్న ఓ లేడీ కండక్టర్‌కు మ్యారేజ్ డే సందర్భంగా తోటి కార్మికులు ప్రత్యేకంగా వేడుక ఏర్పాటు చేశారు. సమ్మె కారణంగా సెలవు లేకపోయినా సహచరులతో కలిసి వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని దంపతులు తెలిపారు.