రామసముద్రం యువతి బెంగళూరులో దారుణ హత్య
అన్నమయ్య: రామసముద్రం మండలం బిక్కంగారిపల్లి వాసి దేవిశ్రీ (21) బెంగళూరులో దారుణ హత్యకు గురైంది. ఆమె బెంగళూరులో BBA చదువుతోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రికి చెందిన ప్రేమ్ వర్ధన్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ, నిన్న రాత్రి ప్రేమ్ ఆమెను హత్య చేసి పరారైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.