ఈనెల 26న దివ్యాంగులకు ఆటల పోటీలు
NLR: జిల్లాలో ఈనెల 26న దివ్యాంగులకు ఆటల పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం. పాండు రంగారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగాలు, ఓపెన్ కేటగిరీలో అథ్లెటిక్స్ స్విమ్మింగ్, టేబుల్‌టెన్నిస్ పోటీలు నిర్వహించునున్నారు.