200 గ్రాముల గంజాయి స్వాధీనం
KMR: అక్రమంగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహరాష్ట్ర నుంచి గంజాయిని హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నారు. కామారెడ్డి మండల శివారులోని పొందూర్తి చౌరస్తాలో తనిఖీలు నిర్వహించగా.. 220 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. కాసమల్ల రాకేష్ అనే వ్యక్తి గంజాయిని తరలిస్తుండగా దాడి చేసి పట్టుకొని విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.