ఆ దర్శకుడితో విజయ్ మూవీ?
దర్శకుడు మగిజ్ తిరుమేనితో నటుడు విజయ్ సేతుపతి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ముంబైకి చెందిన మిరాకిల్ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో విలన్ పాత్ర కోసం సంజయ్ దత్‌ను, హీరోయిన్ కోసం శ్రద్ధా కపూర్‌ను తీసుకోనున్నారట. ఒకేసారి తమిళంతో పాటు హిందీలో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.