భగీరథుని స్మరించుకున్న సీఎం

GNTR: భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో భగీరథుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయనకు శ్రద్ధాంజలి అర్పించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భగీరథుడు తన పట్టుదలతో గంగా నదిని భూమికి తెచ్చిన తీరు ఎప్పటికీ ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.