సివిల్స్ ఫలితాల్లో మెరిసిన జిల్లా వాసి
JN: జిల్లాకు చెందిన యువకుడు భరత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 900వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటారు. 2023లో ఐఎఫ్ఎస్‌కు సెలక్ట్ అయిన ఆయన తాజా ఫలితాల్లో 900వ ర్యాంక్ సాధించారు. ఐఐటీ మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈ సందర్భంగా భరత్ నాయక్ తల్లిదండ్రులు బానోత్ దస్రు నాయక్, అనసూయ దంపతులను జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.