'బీజేపీ నేతలు స్పందించాలి లేదా రాజీనామా చేయాలి'
HYD: తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా BJP ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఖైరతాబాద్ DCC అధ్యక్షులు మోత రోహిత్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలిస్తే మీలో తెలంగాణ రక్తం లేదా అని BJP నాయకులను ప్రశ్నించారు. BJP నేతలు దీనిపై స్పందించాలని లేదా రాజీనామా చేయాలన్నారు.