కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు సమావేశం
NDL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ కలెక్టర్ రాజకుమారి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. నీటిపారుదల సలహా మండలి సమావేశంలో వారు పలు కీలక విషయాలను చర్చించారు.