వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడిగా ఎంపీ మేడా

వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడిగా ఎంపీ మేడా

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడుగా ఎంపీ మేడా రఘునాథరెడ్డిని అధిష్ఠానం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన పరిశీలకులను YS జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జిల్లా పరిశీలకులు ఆ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లకు అనుసంధానంగా పనిచేయనున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మేడా రఘునాథ్ రెడ్డి తెలిపారు.