మహావీర్ జయంతి.. మాంసం దుకాణాలు బంద్

మహావీర్ జయంతి.. మాంసం దుకాణాలు బంద్

HYD: మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 31న GHMC పరిధిలోని అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. GHMC చట్టం 1955, సెక్షన్ 533(B) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఆదేశాలను పకడ్బందీగా అమలు చేసేందుకు నగర పోలీసుల సహకారాన్ని కోరుతూ మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు.