ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్
PPM: జిల్లా కేంద్రం మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ డా, ప్రభాకర్ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ మేరకు వేసిన సీళ్ళను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలత ఉన్నారు.