మహిళా ప్రజాసేవకులకు సన్మానం చేసిన మంత్రి
వరంగల్ నగరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రజాసేవకులకు సన్మానం చేసి, ఇందిర మహిళా శక్తి క్రింద మంజూరైన కుట్టు మిషన్లను లబ్ధిదారులకు మంత్రి కొండా సురేఖ శనివారం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ... మహిళలను ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.