పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఈవో

NTR: విజయవాడలో గురువారం పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ పరిశీలించారు. ఓటర్లకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.