పారిశుద్ధ్య పనులు తనిఖీ చేసిన ఎంపీడీవో

GNTR: తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం గ్రామంలో బుధవారం పారిశుద్ధ్య పనులను ఎంపీడీవో శిల్ప తనిఖీ చేశారు. వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యల గురించి తీసుకోవలసిన చర్యలపై పంచాయతీ కార్యదర్శి దీప్తితో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.