నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
కోనసీమ: నగరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గురువారం పవర్ కట్ అమల్లో ఉంటుందని అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. నగరం, మామిడికుదురు, పాసర్లపూడి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, అప్పన్నపల్లి, పెదపట్నం, మొగలికుదురు గ్రామాలతో పాటు రాజోలు మండలం తాటిపాక గ్రామానికి కరెంటు సరఫరా నిలిపివేస్తామన్నారు.