మంత్రి ఇంటి ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళన
SRD: స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని మంత్రి దామోదర రాజనర్సింహ నివాసం ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం సరికాదని చెప్పారు. బకాయిలు విడుదల చేసే వరకు ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.