ఈ నెల 9న మార్కాపురంకు MLA తాటిపర్తి రాక

ప్రకాశం: ఈ నెల 9న మార్కాపురంలో YCP ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. కాగా, కూటమి ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తుందని, యూరియా మీద మాట్లాడితే కేసులు పెడుతూ బెదిరిస్తున్నారన్నారు.