పంచాయతీ ఎన్నికల్లో లక్కీ డీప్ ద్వారా విజేత
VKB: కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల్ మండలం చెట్టుపల్లి తండా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితం ఉత్కంఠగా సాగింది. గురువారం రాత్రి జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్, స్వతంత్ర అభ్యర్థి గోపాల్లకు చెరో 190 ఓట్లు సమానంగా వచ్చాయి. దీంతో రిటర్నింగ్ అధికారులు లక్కీ డీప్ నిర్వహించారు. లాటరీ ద్వారా స్వతంత్ర అభ్యర్థి గోపాల్ విజేతగా నిలిచినట్లు ప్రకటించారు.