VIDEO: పార్టీ పటిష్టతకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ
VSP: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు విశాఖపట్నం పర్యటనలో భాగంగా పెందుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. పార్టీ పటిష్టతకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.