కోడుమూరులో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం

కోడుమూరులో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం

KRNL: కోడుమూరు ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎద్దుల మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కటింగ్ చేసి, వృద్ధులకు భోజనాలు అందించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ రంగంలో నూతన టెక్నాలజీ పట్ల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.