మిషన్ భగీరథ గ్రిడ్‌ను పరిశీలించిన శిక్షణ డీపీవో

మిషన్ భగీరథ గ్రిడ్‌ను పరిశీలించిన శిక్షణ డీపీవో

KNR: ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామ శివారులో ఉన్న మిషన్ భగీరథ ప్రధాన గ్రిడ్‌ను శిక్షణ జిల్లా పంచాయతీ అధికారి రేవంత్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నీటి లభ్యత, శుద్ధీకరణ ప్రక్రియను అధికారులు ఆయనకు వివరించారు. గ్రిడ్‌కు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? పంపిణీ విధానం, తదితర అంశాలపై రేవంత్ ఆరా తీశారు.