నేత్రపర్వంగా "బోనాల జాతర"

NZB: జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో మంగళవారం "బోనాల జాతరను" అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతి, ఆచార సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని తాజా మాజీ సర్పంచ్ గోర్త పద్మ రాజేందర్ అన్నారు. మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అందరూ బాగుండాలని అమ్మవార్లను వేడుకున్నామన్నారు. ఈ మహోత్సవంలో గ్రామ ప్రజలు ఉన్నారు.