విజయవాడలో ఇరువురు పిల్లలు అదృశ్యం
NTR: విజయవాడకు చెందిన ఇరువురు పిల్లలు అదృశ్యమైనట్లు కృష్ణలంక సీఐ నాగరాజు తెలిపారు. వీరిద్దరూ బుధవారం ఉదయం స్కూలుకు వెళ్లి స్కూల్ అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో అదృశ్యమైనట్లు చెప్పారు. వీరిద్దరి వయసు 10 నుంచి 11 మధ్య ఉంటుందని తెలిపారు. వీరి ఆచూకీ తెలిసిన యెడల కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని ఏసీపీ పవన్ కుమార్ అన్నారు.