సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న సీనియర్ సివిల్ జడ్జి
NDL: పాణ్యం మండలం ఎస్. కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని విజయవాడ సీనియర్ సివిల్ జడ్జి రమణారెడ్డి సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వారి రాకకు ఆలయ ఈవో ఎం. రామకృష్ణ ఆలయ మర్యాదలతోస్వాగతం పలికి ప్రధాన అర్చకులు సురేష్ శర్మ అభిషేకం, కుంకుమార్చన మహామంగల హారతితో పూజలు నిర్వహించారు. అనంతరం శాలువతో, పూలమాలలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందచేశారు.